ETV Bharat / crime

కొవిడ్ నోడల్ అధికారికే దక్కని పడక.. సమయానికి చికిత్స అందక మృతి! - nodel officer dised due to corona in kurnool district

ఆయనో జిల్లా అధికారి.. అందులోనూ కొవిడ్‌ ఆసుపత్రుల నోడల్‌ అధికారి. అలాంటి వ్యక్తికే ఆసుపత్రుల్లో పడక దొరక్క ప్రాణాలొదిలిన దయనీయ ఘటన.. ఏపీలోని అనంతపురంలో చోటుచేసుకుంది.

covid nodal officer died at anantapur
covid nodal officer died at anantapur
author img

By

Published : May 16, 2021, 4:06 PM IST

సూక్ష్మ సాగునీటి పథక సంచాలకులు బీఎస్‌ సుబ్బరాయుడు (58).. మూడు రోజుల నుంచి మూత్ర సంబంధిత సమస్యతో ఇబ్బందిపడ్డారు. కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల కోసం పలు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అన్నీ కొవిడ్‌ ఆసుపత్రులు కావటంతో ఎక్కడా చేర్చుకోలేదు. బీపీ, షుగర్‌ వ్యాధులకు మందులిచ్చి పంపారు. సీటీ స్కానింగ్‌ చేయగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శుక్రవారం సాయంత్రం సమాచారం వచ్చింది. అప్పటికే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పల్స్‌ రేటు పడిపోయిందని.. పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పడక దొరకలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు.

‘నేను జిల్లా అధికారిని.. చేతులెత్తి ప్రాధేయపడుతున్నా.. పడక కేటాయించండి’ అని సుబ్బరాయుడు కోరినా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. చివరికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. అందులో వెంటిలేటర్‌ సదుపాయం లేక.. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో కనీసం స్ట్రెచర్‌ ఇచ్చేవారే కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. కుమార్తెలు, కుమారుడు చేతులపై ఎత్తుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారన్నారు. సుబ్బరాయుడి స్వస్థలం కర్నూలు జిల్లా అవుకు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

ఇవీచూడండి: భాగ్యనగరానికి భారీ సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.