Mother died of a heart attack after son's death: కడుపున పుట్టిన కొడుకు కానరాని లోకాలకు పయనమయ్యాడని తెలుసుకున్న ఆ తల్లి తనువు చాలించింది. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో జరిగింది. కేవలం గంట వ్యవధిలోనే తల్లి, కుమారుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కొత్త మాధవరానికి చెందిన బాలరాజు అనే యువకుడు.. మృకుందాశ్రమం సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఈ విషయాన్ని స్థానికులు అతని తల్లి సుబ్బనరసమ్మకు తెలియజేశారు. కొడుకు మరణ వార్త విన్న ఆ తల్లి.. గుండెపోటుతో మృతి చెందింది. గంట వ్యవధిలోనే తల్లి, కుమారుడు మృతి చెందడంతో కొత్త మాధవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: