మానేరు చెక్ డ్యామ్ నిర్మాణం కోసం తవ్విన గుంటలోని నీటిలో మునిగి తల్లి కొడుకులు మృతి చెందారు. ఈ ఘటన పెద్దపల్లి ముత్తారం మండలం జిల్లా ఖమ్మంపల్లి గ్రామంలో జరిగింది.
జిల్లాలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బగ్గని సుమలత, ఆమె కుమారుడు మనోజ్ శుక్రవారం మధ్యాహ్నం ఆరబెట్టిన వడ్లను కుప్పలుగా చేసుకుని.. అనంతరం సమీపంలో నిర్మాణం జరుగుతోన్న చెక్ డ్యామ్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మనోజ్ నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా నీట మునిగి చనిపోయి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. స్థానికులంతా గాలింపు చేపట్టడంతో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: High Court: మరో శతాబ్దానికి సొమ్ము చెల్లిస్తారా: హైకోర్టు ఆగ్రహం