Bus Accident: ఉగాది పర్వదినాన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో తల్లీకొడుకులు మృతి చెందగా.. తండ్రీకూతురికి తీవ్రగాయాలయ్యాయి. మానకొండూరుకు చెందిన ఆంజనేయులు, భార్య సౌజన్యతో పాటు కుమారుడు, కుమార్తెతో కలిసి కరీంనగర్ నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో.. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోతుండగా.. ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది.
ఈ దుర్ఘటనలో తల్లితో పాటు ఏడేళ్ల కుమారుడు యశ్వంత్ దుర్మరణం చెందారు. వాహనం నడుపుతున్న అంజనేయులుతో పాటు కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదకరమైన మలుపులో ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పండుగ రోజు కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో విషాదం నెలకొంది.
ఇదీ చూడండి: