ఓ వివాహితుడి వేధింపులు తాళలేక బాలిక బలవన్మరణాని(Minor Suicide)కి పాల్పడింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన బాలిక(17) ఎంఎల్టీ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. వసతి గృహంలో ఉంటూ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో పనిచేసే ఓ వివాహితుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్ని రోజుల తర్వాత ఆ పరిచయాన్ని అడ్డుగా పెట్టుకుని బాలికను.. అతను వేధించడం మొదలెట్టాడు. డబ్బులు కావాలంటూ వేధించేవాడు. ఏం చేయాలో తెలియక బాధితురాలు ఫోన్ అమ్మేసి అతనికి డబ్బులిచ్చింది.
అయినప్పటికీ అతని తీరు మారకపోవడంతో.. మనస్తాపం చెందిన బాలిక ఆదివారం రాత్రి.. హాస్టల్ గదిలో నిద్రమాతలు మింగి ఆత్మహత్య(Minor Suicide)కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని(Minor Suicide) పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Student suicide: ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య