ETV Bharat / crime

Rape on girl: ఇల్లు మారినా వదల్లేదు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. - rape on women news

Rape on minor girl: మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై లైంగిక వేధింపులు ఏ మాత్రం తగ్గడం లేదు. బలవంతంగానో, మత్తు మందో కలిపో వారిపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు. బాధితుల్లో ఎక్కువగా చిన్న పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వేధింపులు తాళలేక ఇల్లు మారినా కూడా కామాంధులు వెంటాడుతూనే ఉన్నారు. రెండ్రోజుల క్రితం బాలికపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలను శంషాబాద్​ డీసీపీ జగదీశ్వర్​ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

rape on minor girl
బాలికపై అత్యాచారం
author img

By

Published : Dec 30, 2021, 5:29 PM IST

Rape on minor girl: ఆ బాలిక రంగారెడ్డి జిల్లా​ పరిధిలో నివసిస్తోంది. స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వారి ఇంట్లోనే ఓ పోర్షన్​లో బాలుడి కుటుంబం కిరాయికి ఉంటోంది. పక్క పక్క పోర్షన్లు కదా అని కిరాయి వాళ్లతో మాటా ముచ్చటా కలిపారు బాలిక కుటుంబీకులు. ఈ క్రమంలో ఆ బాలుడి కన్ను ఇంటి యజమాని కూతురిపై పడింది. ఎలాగైనా ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలనుకున్నాడు. ఆ అబ్బాయి వయసు కూడా 18 లోపే.. చదువుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాల్సిన వయసులో కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. చిన్నగా ఆ అమ్మాయితో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు. పక్కింటి అబ్బాయే కదా అని ఆ బాలిక కూడా స్నేహ పూర్వకంగానే మెలిగింది. దీంతో అదును చూసుకుని అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు ఆ కుర్రాడు. అతని ప్రవర్తనకు విసిగి.. బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆ అబ్బాయిని పలుమార్లు హెచ్చరించారు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో వారిని ఖాళీ చేయించి.. ఉన్న ఇంటిని అమ్మేసి వేరే ప్రదేశానికి వెళ్లిపోయారు.

అయినా వదల్లేదు

అయినప్పటికీ ఆ కామాంధుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. బాలిక ఉంటున్న ఇంటిని కనిపెట్టి.. మళ్లీ అక్కడికి వెళ్లడం.. తరచూ వేధించడం మొదలుపెట్టాడు. మాట్లాడమని బలవంతం చేసేవాడు. ఈ క్రమంలో బాలికకు గుడికి వెళ్దామని చెప్పి రెండ్రోజుల క్రితం రాజేంద్రనగర్​ కొత్వాల్​ గూడ గుట్టల వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాధితురాలిని అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న శంషాబాద్​ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాలికను ఇంటివద్ద దిగబెట్టారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలుడు కర్ణాటకలోని గుల్బార్గా వాసిగా గుర్తించారు.

పారిపోయేందుకు యత్నం

ఈ క్రమంలో తనపై కేసు నమోదైనట్లు తెలుసుకున్న నిందితుడు.. కర్ణాటకకు పారిపోయేందుకు యత్నించాడు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. బాలుడుని అత్తాపూర్​ వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్​ రిమాండ్​కు తరలిస్తామని డీసీపీ జగదీశ్వర్​ రెడ్డి చెప్పారు. మహిళలపై తరచూ జరుగుతున్న లైంగిక వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. ఆన్​లైన్​ ప్రేమ వ్యవహారాలపై సైతం జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Murders Due to Alcohol : తప్ప తాగుతున్నారు.. విచక్షణ కోల్పోయి చంపుతున్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.