వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి వద్ద పాలవ్యాను ఢీకొని ఇద్దరు మృతి చెందారు. అమ్మాయిపల్లికి చెందిన సాయి రెడ్డి, రాజశేఖర్రెడ్డి అన్నదమ్ములు. ఇద్దరు కలిసి ఉదయం పొలం వద్దకు వెళ్లి అక్కడ పనులను ముగించుకుని ఇంటికి నడిచి వెళ్తుండగా... గ్రామశివారులో పాలను తీసుకెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కుటంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాయక్ తెలిపారు.
ఇదీ చూడండి: జలాశయంలో మునిగి ఐదుగురు దుర్మరణం