ETV Bharat / crime

SUICIDE: మొహర్రం వేడుకల్లో విషాదం.. పీరీల గుండంలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య - ఆంధ్రప్రదేశ్​ వార్తలు

మొహర్రం వేడుకలను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి... అకస్మాత్తుగా పీరీల గుండంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు అప్రమత్తమై బయటకు తీసేలోపే ప్రాణాలొదిలాడు.

KURNOOL SUICIDE
KURNOOL SUICIDE
author img

By

Published : Aug 20, 2021, 11:29 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా అవుకు మండలంలోని సుంకేసుల గ్రామంలో మొహర్రం వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. సుంకేసుల గ్రామంలో పీరీల గుండం చూసేందుకు... కాశీపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (55) వచ్చాడు. కొంతసేపు అక్కడే ఉండి మొహర్రం వేడుకలను తిలకించాడు.

ఏమైందో ఏమో తెలియదు కానీ... స్థానికులు చూస్తుండగానే ఉన్నట్లుండి ఒక్కసారిగా పీరీల గుండంలోకి దూకాడు. షాక్​ గురైన స్థానికులు గమనించి బయటకు తీసేలోపే పూర్తిగా కాలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్వరరెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: Srisailam Project incident : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటనకు ఏడాది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.