ETV Bharat / crime

Suicide: మానసిక ఒత్తిడికి లోనై.. విద్యార్థిని ఆత్మహత్య.!

హైదరాబాద్​ జవహర్​నగర్​లో వైద్య విద్యార్థిని.. ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

medical student committed suicide
వైద్య విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Aug 2, 2021, 12:44 PM IST

మానసిక ఒత్తిడి తట్టుకోలేక బీడీఎస్​ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్​ జవహర్​నగర్​లో చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన రాజ్​వీర్​ సింగ్​ ఆర్మీ సుబేదార్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుమార్తె సునంద.. జవహర్​నగర్​ పరిధిలోని ఓ డెంటల్​ కళాశాలలో బీడీఎస్​ చదువుతోంది. 2016 బ్యాచ్​కు చెందిన సునంద.. ఎంబీబీఎస్​ సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి తగ్గేందుకు వైద్యుడిని సంప్రదించింది. చికిత్స అనంతరం ఆ పరిస్థితి నుంచి యువతి కోలుకుంది.

కాగా రెండు రోజుల క్రితం సునంద తల్లి వీడియో కాల్​లో ఆమెతో సంభాషించినట్లు జవహర్​నగర్​ పోలీసులు వెల్లడించారు. వారిద్దరి సంభాషణలో ఆమె తన వివాహానికి సంబంధించిన విషయం ప్రస్తావనకు తీసుకువచ్చినట్లు తెలిపారు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సునంద ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి: Heavy Floods : మున్ముందు వరద ముప్పు.. జాగ్రత్తలు సూచిస్తోన్న జీహెచ్​ఎంసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.