ETV Bharat / crime

'ఈటల రాజేందర్‌ భయపెట్టారు.. అనుమతులు లేకుండా నిర్మించారు' - మాసాయిపేట భూకబ్జా

మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భార్య పేరిట ఉన్న జమునా హేచరీస్‌ ఆక్రమణలో 66 ఎకరాల సీలింగ్‌, అసైన్డు భూములు ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆరు పేజీల నివేదికలో 20 మంది రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలు పొందుపరిచారు. కేసీఆర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు అందించిన రైతులతో పాటు మరో 12 మందితో మాట్లాడి వారు చెప్పిన వివరాలనూ జతచేశారు.

medak-collector-submit-report-on-etela-rajender-occupied-lands-to-government
'ఈటల రాజేందర్‌ భయపెట్టారు.. అనుమతులు లేకుండా నిర్మించారు'
author img

By

Published : May 3, 2021, 6:49 AM IST

‘‘పూర్తిస్థాయిలో డబ్బు చెల్లించకుండానే ఈటల రాజేందర్‌, ఆయన బంధువు సూరి తమ అసైన్డు భూములు లాక్కున్నారని... తమను భయపెట్టి ఇలా చేశారని ఎనిమిది మంది రైతులు తెలిపారు. మరో 12 మంది తమ భూముల్లో షెడ్లు, భవనాలు నిర్మించారని, చాలా లోతుగా తవ్వి మట్టిని తోడుకెళ్లారని, రోడ్లు వేశారని వివరించారు’’ అని మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలియజేశారు. రైతుల ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భార్య పేరిట ఉన్న జమునా హేచరీస్‌ ఆక్రమణలో 66 ఎకరాల సీలింగ్‌, అసైన్డు భూములు ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్‌ శనివారమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

సీఎం కేసీఆర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు అందించిన రైతులతో పాటు మరో 12 మందితో మాట్లాడి వారు చెప్పిన వివరాలనూ ఆరు పేజీల నివేదికలో జతచేశారు. ‘‘సాధారణంగా నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు నాలా అనుమతులు తీసుకోవాలి. ఇక్కడ అలాంటివేమీ లేకుండానే షెడ్లు, భవనాలు నిర్మించారు. రోడ్లూ వేశారు. ఈ విషయమై తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. నష్టమెంతో తేల్చి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలి’’ అని కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపిన నివేదికలో సూచించారు. హకీంపేటలోని సర్వే నంబరు 97, అచ్చంపేటలోని 77, 78, 79, 80, 81, 82, 130లలో మొత్తం 66.01 ఎకరాల భూమి జమునా హేచరీస్‌ పేరిట ఆక్రమించారంటూ ఏయే సర్వే సంఖ్యలో ఎంత ఉందో స్పష్టంగా మ్యాపులతో చూపెట్టారు. 55.26 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు తేల్చారు.

బోర్డు ఏర్పాటు చేసి

‘ఇది ప్రభుత్వ భూమి’ అంటూ బోర్డులు

కబ్జాదారులు రోడ్డు ఏర్పాటు చేసే క్రమంలో భారీగా చెట్లను నరికేశారని అటవీ అధికారులు తెలిపారు. ఎన్ని చెట్లు ఇలా తొలగించి ఉంటారో గుర్తించేందుకు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించామని త్వరలో పూర్తి వివరాలతో జిల్లా కలెక్టరుకు నివేదిక అందించనున్నామని వివరించారు. అటవీ పరిరక్షణ చట్టం-1980 ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. తెలంగాణ అసైన్డు భూముల చట్టం, 1977 ప్రకారం ఆక్రమించిన 66.01 ఎకరాల అసైన్డు భూములను స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ వర్గాలు వివరించాయి. ఆదివారం రెవెన్యూ సిబ్బంది అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఆక్రమణలకు గురైన అసైన్డు భూముల్లో ‘ఇది ప్రభుత్వ భూమి’ అంటూ బోర్డులు పాతారు.

కొనసాగిన విజిలెన్స్‌ విచారణ

విజిలెన్స్‌ అధికారులు విచారణను రెండో రోజు ఆదివారం కూడా కొనసాగించారు. మాసాయిపేట తహశీల్దారు కార్యాలయంతో పాటు తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. భూములకు సంబంధించిన పహాణీలు, ఇతర రెవెన్యూ రికార్డులను మాసాయిపేటలోని తహశీల్దారు కార్యాలయంలో వారు పరిశీలించారు. తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి మరికొన్ని దస్త్రాలను తీసుకెళ్లారు.

అసైన్డు భూమిలో నీటి పైపుల తొలగింపు

పైపులు తొలగిస్తున్న హేచరిస్ సిబ్బంది

అచ్చంపేట సర్వే నంబరు 130లో జమునా హేచరీస్‌ అధీనంలో ఉన్న అసైన్డు భూముల్లో ‘ఇది ప్రభుత్వ స్థలం’ అంటూ రెవెన్యూ సిబ్బంది ఆదివారం బోర్డులు ఏర్పాటు చేసిన వెంటనే ఆ సంస్థ వారు రంగంలోకి దిగారు. అందులోని నీటి పైపులను తొలగించి గుంతలు పూడ్చారు. ఈ విషయమై వారిని ప్రశ్నించగా హేచరీస్‌ ప్రతినిధి ఆదేశాల మేరకు పైపులు తొలగించి చదును చేశామని ఇంతకు మించి తెలియదని సమాధానం ఇచ్చారు.

ఇదీ చూడండి: మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.