ETV Bharat / crime

భర్తకు దూరమయ్యానని మనస్తాపం.. వివాహిత ఆత్మహత్య - women committed suicide at kishanguda

భర్తకు దూరంగా ఉంటున్నాననే మనస్తాపంతో ఓ వివాహిత తనువు చాలించింది. క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్​నగర్​లో చోటుచేసుకుంది.

women committed suicide
వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Mar 31, 2021, 2:15 PM IST

మహబూబ్​నగర్ జిల్లా నవాబ్​పేట మండలం కిషన్​గూడాలో విషాదం చోటుచేసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్నాననే మనస్తాపంతో చైతన్య అనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కిషన్​గూడ గ్రామానికి చెందిన చైతన్య వివాదాల కారణంగా కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన చైతన్య.. మూడు రోజుల క్రితం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: టీ పొడి అనుకొని ఎండ్రిన్​ వేసుకుని.. మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.