మానసిక ఒత్తిడితో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ అల్వాల్‌లో చోటు చేసుకుంది. బృందావన్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాధిక గత రెండు నెలలుగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయమై పలుమార్లు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Suicide: కుటుంబ కలహాలతో వృద్ధురాలు ఆత్మహత్య