ETV Bharat / crime

పరిచయం.. ప్రేమ.. కిడ్నాప్​.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు - Medical student kidnapped in Manneguda

Remand report on Naveen Reddy: వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో ఆదిభట్ల పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. వైశాలితో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకోవాలని నవీన్ రెడ్డి భావించాడని.. ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు ప్రచారం చేసుకున్నాడని నివేదికలో స్పష్టంచేశారు. వైశాలి నిశ్చితార్థం జరుగుతోందన్న విషయం తెలుసుకొని.. స్నేహితులతో కలిసి ఆమెను అపహరించారని అన్నారు. పోలీసులు గాలిస్తున్నారన్న విషయం తెలుసుకొన్న నవీన్‌రెడ్డి.. స్నేహితుడి సాయంతో కారులో వైశాలిని మన్నెగూడలో దింపినట్లు పేర్కొన్నారు.

Remand report on Naveen Reddy
Remand report on Naveen Reddy
author img

By

Published : Dec 13, 2022, 3:52 PM IST

Updated : Dec 13, 2022, 8:03 PM IST

Remand report on Naveen Reddy: వైశాలితో ప్రేమ, పెళ్లి విషయంలో నవీన్ రెడ్డి కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలు పొందుపర్చారు. గతేడాది బొంగులూరులోని ఆర్​డీ-స్పోర్ట్స్ అకాడమీలో వైశాలికి నవీన్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వైశాలి ఫోన్‌ నెంబర్ తీసుకున్న నవీన్‌రెడ్డి.. ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ సందేశం పంపించారు. ఆ తర్వాత తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పంపించాడు.

ఈ పరిచయాన్ని అడ్డు పెట్టుకొని వైశాలితో కలిసి ఫోటోలు తీసుకున్నాడు. నవీన్‌రెడ్డి పెళ్లి ప్రస్తావన తేవడంతో, తల్లిదండ్రులు ఒప్పుకుంటే చేసుకుంటానని వైశాలి చెప్పింది. దీంతో వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి యత్నించాడు. తన బంధువులను సైతం ఆమె ఇంటికి పంపించి తండ్రి దామోదర్ రెడ్డితో మాట్లాడించాడు. కానీ పెళ్లికి అంగీకరించకపోవడంతో వైశాలిపై నవీన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. నకిలీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఇద్దరు దిగిన ఫోటోలను వైరల్ చేశాడు.

ఇది వరకే నవీన్​రెడ్డిపై వైశాలి ఫిర్యాదు: ఐదు నెలల క్రితం వైశాలి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకున్న నవీన్ రెడ్డి.. అందులో 'మిస్టర్-టీ' వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు నడిపించారు. ఆగస్టు 31న ఆ షెడ్డులో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం సందర్భంగా నానా రభస చేసినట్లు వైశాలి ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వైశాలికి అమెరికా పెళ్లి సంబంధం రావడంతో.. ఈనెల 9న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి, వైశాలిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు 'మిస్టర్-టీ' స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. ఉదయం పదకొంటున్నర గంటలకు మూడు కార్లు, ఓ డీసీఎమ్​లో మన్నెగూడలోని సిరిటౌన్ షిప్‌లో ఉండే వైశాలి ఇంటికి చేరుకున్నాడు.

పథకం ప్రకారం కిడ్నాప్: కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డిని అడ్డుకోబోయిన వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి, బాబాయ్ పైనా దాడి చేశారు. ఇంట్లోకి వెళ్లి సోఫా, టిపాయి, టీవీ, ఇతర ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వైశాలిని ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. తన కారులో కూర్చోబెట్టాడు. నవీన్ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి వైశాలిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయారు.

నల్గొండ వైపు వెళ్లే మార్గంలో నవీన్ రెడ్డి, వైశాలిని కొట్టడంతో ఆమె నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. మిగతా నిందితులంతా మన్నెగూడ వైపు పారిపోయారు. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు. మిర్యాలగూడ దాటిన తర్వాత నవీన్ రెడ్డి స్నేహితుడు రూమెన్.. ఫోన్ ఆన్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్న విషయం తెలుసుకొని వెంటనే నవీన్ రెడ్డిని అప్రమత్తం చేశాడు. వైశాలిని ఇంటి వద్ద వదిలేద్దామని నిర్ణయించుకున్న నవీన్ రెడ్డి, అతని ఇద్దరు స్నేహితులు.. నల్గొండకు 20 కిలోమీటర్ల దూరంలో కారు దిగిపోయారు.

స్నేహితుడు సహాయంతో వైశాలిని క్షేమంగా ఇంటికి పంపిన నవీన్​రెడ్డి: రూమెన్ మాత్రం వైశాలిని కారులో ఎక్కించుకొని మన్నెగూడ వైపు పయనమయ్యాడు. 9వ తేదీ సాయంత్రం 6.30గంటల సమయంలో రూమెన్ ఫోన్ వైశాలికి ఇచ్చి తన తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆ తర్వాత వెంటనే ఫోన్ లాగేసుకొని స్విచాఫ్ చేశాడు. మన్నెగూడకు చేరుకున్న తర్వాత మరోసారి ఫోన్ ఆన్ చేసి వైశాలికి ఇచ్చి మన్నెగూడలోని ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నట్లు వైశాలితో చెప్పించాడు. వెంటనే రూమెన్ తన ఫోన్ తీసుకొని స్విచాఫ్ చేసి కారులో పారారయ్యాడు. కారును శంషాబాద్ మండలం తొండుపల్లిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

కేసులో మొత్తం 36మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 32మందిని అరెస్ట్ చేసిన పోలీసులు... అందులో ఐదుగురిని కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నవీన్ రెడ్డి, రూమెన్ తోపాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం ఎస్ఓటీ బృందాలు గాలిస్తున్నాయి.

Last Updated : Dec 13, 2022, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.