నిజామాబాద్ జిల్లా మొస్ర మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. మృతుడు చింతకుంట గ్రామానికి చెందిన దత్తుగా పోలీసులు గుర్తించారు. మద్యం తాగించి హత్య చేసినట్లు భావిసున్నారు. హత్యకు గల కారణం వివాహేతర బంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దత్తు రెండో భార్య స్వరూప, ఆమె తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- ఇదీ చూడండి : దేశంలో కొత్తగా 8,635 కరోనా కేసులు