Man Killed His Wife : ఇరవై మూడేళ్ల దాంపత్య జీవితం.. ముగ్గురు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో అనుమానం చిచ్చురేపింది. శుక్రవారం ఉదయం జరిగిన గొడవలో విచక్షణరహితంగా కొట్టడంతో ఆ ఇల్లాలు ప్రాణాలొదిలింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఠాణా పరిధిలోని గాజులరామారం బతుకమ్మబండలో జరిగిన ఘటన స్థానికులను కలవరపెట్టింది.
విచక్షణారహితంగా కొట్టాడు.. గాజులరామారం బతుకమ్మబండకు చెందిన కర్ణె బాలకృష్ణ, మమత(38)కు 23 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అతను ఏసీ మెకానిక్. ఆర్థికంగా ఏ లోటూ లేదు. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గురువారం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. మరుసటిరోజు కూడా గొడవ జరగడంతో వాటర్ హీటర్, ఇంట్లో వస్తువులతో తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయాలవడంతో ఇంట్లోనే కూప్పకూలింది.
హత్య చేసి ఆత్మహత్యగా.. చనిపోయినట్లు నిర్ధారించుకున్న బాలకృష్ణ... ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా స్థానికులు చూసి అడిగారు. బుధవారం రోజు పని మీద బయటకు వెళ్లి అదృశ్యమైందని.. ఆమె కోసం వెతకగా.. చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉందని స్థానికులకు చెప్పాడు. అతని వాలకం చూసి అనుమానమొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బాలకృష్ణ.. అతడి ఇద్దరి కుమారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి :