ETV Bharat / crime

మహరాష్ట్ర మద్యం సరఫరా.. ఇద్దరు అరెస్ట్

రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం సలాబత్​పూర్​ సరిహద్దులోని అబ్కారీ తనిఖీ కేంద్రం వద్ద పట్టుకున్నారు. వారి నుంచి 96 దేశీదారు మద్యం సీసాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Feb 18, 2021, 2:28 PM IST

Maharashtra liquor seized in kamareddy district near salabathpur border excise check post
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహరాష్ట్ర మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 96 దేశీదారు మద్యం సీసాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం సలాబత్​పూర్​ సరిహద్దులో అబ్కారీ తనిఖీ కేంద్రం వద్ద వారిని పట్టుకున్నారు.

​ మహారాష్ట్రలోని దెగ్లూర్ ప్రాంతం నుంచి జిల్లాలోని మద్నూర్ మండలం డోంగ్లీ గ్రామానికి ఆటోలో తరలిస్తున్నట్లు అబ్కారీ ఎస్సై నరేష్ తెలిపారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు డోంగ్లీకి చెందిన విఠల్, మరొకరు పోతంగల్​కు చెందిన సతీశ్​ గౌడ్​గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్​ చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చూడండి : ఇంకుడుగుంతలో పడి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.