ETV Bharat / crime

'నిషేధిత గుట్కాలను విక్రయిస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తాం' - SP warning to gutka sellers

రాష్ట్ర ప్రభుత్వం గుట్కాలపై నిషేధం విధించిందని మహబూబ్​నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని గుట్కాలు విక్రయించే దుకాణాలు, గోదాములపై చేసిన ఆకస్మిక దాడులలో పాల్గొన్నారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు.

SP warning to gutka sellers
గుట్కా విక్రయ దుకాణాలు, గోడౌన్​లపై దాడులు నిర్వహించిన ఎస్పీ
author img

By

Published : Jun 12, 2021, 8:26 AM IST

ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే గుట్కా వ్యాపారంను మానుకోవాలని వ్యాపారులకు మహబూబ్‌నగర్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో నిషేధిత గుట్కాలు విక్రయించే దుకాణాలు, గోదాములపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టుబడిన గుట్కా నిల్వలను పరిశీలించిన ఎస్పీ.. చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గుట్కాలపై నిషేధం విధించిందని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయం తెలియక వీటిని తిని అనేక మంది ప్రమాదకర రోగాలబారిన పడుతున్నారని అన్నారు. మహబూబ్‌నగర్‌లో పలు దుకాణాలు, గోదాం​లపై ఏక కాలంలో 18 పోలీసు బృందాలతో దాడులు జరిపామన్నారు. గుట్కా వ్యాపారానికి సంబంధించి, ఇతర జిల్లాల నుంచి జరిగే రవాణాపై తమ వద్ద మరింత నమ్మకమైన సమాచారం ఉందని చెప్పారు. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గుట్కాలను సరఫరా చేసే వారితో పాటు అమ్మేవారిపై పీడీ యాక్ట్‌ చట్టం మేరకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: rythu bandhu: రైతుబంధు లెక్కలపై సాగదీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.