ETV Bharat / crime

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నారాయణరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు - software engineer narayana reddy murder case

హైదరాబాద్ కేపీహెచ్​బీ కాలనీలో అదృశ్యమై.. సంగారెడ్డి జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో శవమై తేలిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ నారాయణరెడ్డి హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కూతురుకి వేరే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డి.. తన బంధువు శ్రీనివాస్​రెడ్డికి రూ.4.5 లక్షలకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఈ కేసులో శ్రీనివాస్​రెడ్డి, కాశీ, షేక్ అశీక్​ను అరెస్ట్​ చేశామని.. నారాయణరెడ్డి మామ వెంకటేశ్వరరెడ్డి, బావమరిది చంద్రశేఖర్​రెడ్డి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

madhapur dcp shilpavalli
madhapur dcp shilpavalli
author img

By

Published : Jul 9, 2022, 2:53 PM IST

పథకం ప్రకారమే నారాయణరెడ్డి హత్య: డీసీపీ శిల్పవల్లి

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో ఉంటూ హత్యకు గురైన ఏపీలోని ప్రకాశం జిల్లా రాజపాలెం యువకుడు నారాయణరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పరువు కోసం యువతి తండ్రి వెంకటేశ్వర్‌ రెడ్డి ఈ హత్య చేయించినట్లు మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. కూతురికి వేరే పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే యువతి తండ్రి వెంకటేశ్వర్‌ రెడ్డి, బంధువు శ్రీనివాస్‌ రెడ్డికి రూ.4.50 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు వెల్లడించారు. ఈ కేసులో శ్రీనివాస్‌ రెడ్డి, కాశీ, షేక్‌ అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నారాయణరెడ్డి మామ వెంకటేశ్వర్ రెడ్డి, బావమరిది చంద్రశేఖర్‌ రెడ్డి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ నారాయణరెడ్డి హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశాం. నిందితులు శ్రీనివాస్​రెడ్డి, కాశీ, షేక్ఆశిక్​. మరో ఇద్దరు నిందితులు వెంకటేశ్వర్​రెడ్డి, చంద్రశేఖర్​రెడ్డి పరారీలో ఉన్నారు. పోలీసులకు విషయం తెలిసిందని శ్రీనివాస్​రెడ్డి, ఆశిక్​లు విషం తాగారు. విషం తీసుకున్న ఇద్దరూ కోలుకోవడంతో ఇవాళ అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాం.-శిల్పవల్లి, మాదాపూర్​ డీసీపీ

అసలేం జరిగింది..

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్‌ 1లో నారాయణరెడ్డి తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నారు. ఏడాది క్రితం ఓ యువతిని నారాయణరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా యువతి, నారాయణరెడ్డి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నారాయణరెడ్డి కనిపించకపోవడంతో జూన్‌ 30న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది.

ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో పనిచేస్తున్నాడు. అతను గత నెల 24న గిద్దలూరుకు చెందిన ఆశిక్‌ను తీసుకొని కర్నూలు వెళ్లాడు. అక్కడ అద్దెకు తీసుకున్న కారులో మరోవ్యక్తి కాశీని ఎక్కించుకుని 25న సాయంత్రం నగరానికి వచ్చాడు. షేక్‌పేట సమీపంలో అద్దెకు గది తీసుకుని హత్యకు పథక రచన చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. జూన్‌ 27న నారాయణరెడ్డిని కారులో బయటకు తీసుకెళ్లి మెడకు టవల్‌ను చుట్టి హతమార్చారు. అదే కారులో జిన్నారం శివారు రహదారి పక్కన అటవీ ప్రాంతంలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.

హత్య చేసిన తర్వాత కాశీ, ఆశిక్‌తో కలిసి శ్రీనివాస్‌రెడ్డి కారులో కర్నూలు వెళ్లిపోయాడు. ఆశిక్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని తన బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. శ్రీనివాసరెడ్డి, కాశీ.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. నారాయణరెడ్డి కాల్‌ డేటా ఆధారంగా కూపీ లాగటంతో ఆశిక్‌, శ్రీనివాస్‌రెడ్డి చిక్కారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే పరువు హత్య బయటపడింది.

ఇవీ చూడండి..

సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!

భర్త శవాన్ని వదిలేసి.. ఆస్తి కోసం రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు భార్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.