ETV Bharat / crime

Lovers Suicide in Nalgonda : సాగర్‌ కాలువలో దూకిన ప్రేమజంట.. - lovers suicide in haliya

Lovers Suicide in Nalgonda
Lovers Suicide in Nalgonda
author img

By

Published : Mar 21, 2022, 11:47 AM IST

Updated : Mar 21, 2022, 12:45 PM IST

09:41 March 21

Lovers Suicide in Nalgonda : హాలియా వద్ద సాగర్‌ కాలువలో దూకిన ప్రేమజంట

సాగర్‌ కాలువలో దూకిన ప్రేమజంట..

నల్గొండ జిల్లా హాలియా వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. సాగర్‌ కాలువలోకి దూకి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కాలువలో దూకిన యువతీ యువకులను కాపాడేందుకు తాడును తీసుకువచ్చారు. తాడు సాయంతో యువతిని కాపాడారు.

యువకుణ్ని కాపాడేలోగా.. అతను నీటిప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుడి కోసం ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఈ ప్రేమజంట పీఏపల్లి మండల వాసులుగా పోలీసులు గుర్తించారు.

"పీఏపల్లికి చెందిన బాలకృష్ణ తన మరదలిని ప్రేమించాడు. కానీ వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. పెళ్లికి అంగీకారం తెలపలేదు. పెద్దలను ఎదురించలేక.. విడిపోయి బతకలేక చనిపోదామని నిర్ణయించున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఇవాళ ఉదయం పీఏపల్లి నుంచి హాలియా వచ్చారు. సాగర్ కాలువలో ఇద్దరు కలిసి దూకారు. గమనించిన స్థానికులు యువతిని కాపాడారు. బాలకృష్ణను కాపాడదామనుకునేలోగా అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలిస్తున్నాం. యువతిని తన తల్లిదండ్రులకు అప్పజెప్పాం."

- క్రాంతి కుమార్, హాలియా ఎస్సై

Last Updated : Mar 21, 2022, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.