ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబుళాపురం గ్రామ సమీపంలో కనుమ కింద కొండ ప్రాంతంలో చిరుతపులి(Leopard) సంచరిస్తోంది. సీసంగుంతల గ్రామానికి చెందిన మేకను పులి చంపేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు.. పరిశీలించగా పులి జాడలు కనిపించాయి. అక్కడ ఆడపులి ఉందని దానికి మూడు పిల్లలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
చిరుత సంచారంతో సీసంగుంతల గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొండల్లో పరిశీలించిన అటవీశాఖ అధికారులు, కొండల్లోకి వెళ్లొద్దంటూ గ్రామాల్లో దండోరా వేయించారు. గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ఇదీ చూడండి : లైవ్ వీడియో: బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి