ETV Bharat / crime

Accident: లారీ బోల్తా.. క్యాబిన్​ ఇరుక్కుపోయిన డ్రైవర్​ - తెలంగాణ తాజా వార్తలు

బియ్యం లోడు తీసుకెళ్తున్న లారీ బాహ్య వలయ రహదారిపై నుంచి బోల్తా కొట్టింది. దీనితో డ్రైవర్​ క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. క్రేన్​ సాయంతో పోలీసులు.. డ్రైవర్​ను బయటకు తీసి.. ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

lorry accident
lorry accident
author img

By

Published : Jun 4, 2021, 10:40 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాటి గ్రామ కమాన్​ సమీపంలో బాహ్య వలయ రహదారిపై బియ్యం లోడు తీసుకెళ్తున్న లారీ రాత్రి బోల్తా కొట్టింది. దీనితో లారీ డ్రైవర్​ నరసింహులు క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. బానూరు పోలీసులు క్రేన్ సాయంతో చాలా సేపు శ్రమించి.. బయటకు తీసి.. పటాన్​చెరు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్​ ఆసుపత్రికి తరలించారు.

ఈ లారీ బియ్యం లోడును ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్​ పరిస్థితి బాగానే ఉందని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.