ETV Bharat / crime

రోడ్డు క్రాస్​ చేసేటప్పుడు జాగ్రత్త.. లేదంటే ఇలా కూడా జరగొచ్చు! - Karimnagar Road Accident CC Visuals

Karimnagar Road Accident CC Visuals : కరీంనగర్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పద్మానగర్‌ డెయిరీ వద్ద అర్ధరాత్రి వేళ ఎలగందులకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి.. ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. డివైడర్‌ వద్ద మలుపు తిరుగుతుండగా.. అదే సమయంలో బొలెరో వాహనం వేగంగా వచ్చింది. బైక్‌ను తప్పించబోయిన బొలెరో డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయగా.. వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఝార్ఖండ్‌కు చెందిన అమిత్‌ చనిపోగా.. మరో వ్యక్తి కరణ్‌శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. బొలెరోకు అడ్డొచ్చిన ద్విచక్ర వాహనదారుడు శ్రీనివాస్‌ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది.

రోడ్డు దాటేటప్పుడు కాస్త చూసుకోండి.. లేదంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి
రోడ్డు దాటేటప్పుడు కాస్త చూసుకోండి.. లేదంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి
author img

By

Published : Dec 6, 2022, 3:19 PM IST

రోడ్డు క్రాస్​ చేసేటప్పుడు జాగ్రత్త.. లేదంటే ఇలా కూడా జరగొచ్చు!

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.