ETV Bharat / crime

వీడిన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మర్డర్‌ మిస్టరీ.. అసలు ఎందుకు చంపారంటే?!

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య ఘటనలో ప్రాథమిక విచారణ ఆధారంగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశామని ఏపీలోని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ప్రధాన నిందితుడి కోసం ఆరు బృందాలతో గాలించి.. సోమవారం కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

sp
sp
author img

By

Published : May 23, 2022, 10:04 PM IST

Updated : May 23, 2022, 10:35 PM IST

వీడిన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మర్డర్‌ మిస్టరీ.. అసలు ఎందుకు చంపారంటే?!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశామన్నారు. హత్య ఘటన వివరాలను మీడియాకు వెల్లడించిన ఆయన.. తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామన్నారు. సుబ్రహ్మణ్యం బంధువులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

హత్య ఘటనపై నిన్న డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగింటినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడి కోసం ఆరు బృందాలతో గాలించామని.., ఇవాళ నిందితుడు అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతబాబును విచారించి వాంగ్మూలం నమోదు చేశామన్నారు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

హత్య కేసుపై మరిన్ని వివరాలు ఎస్పీ మాటల్లోనే.. "ఈనెల 19న డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. శ్రీరామ్‌నగర్‌లో మిత్రులతో కలిసి రాత్రివేళ సుబ్రహ్మణ్యం మద్యం సేవించాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చారు. సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటివైపు కారులో వెళ్లారు. సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో అనంతబాబు రుణం ఇచ్చారు. అందులో కొంత తిరిగి చెల్లించాడు సుబ్రహ్మణ్యం. మిగిలిన రుణం చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పద్ధతి మార్చుకోవాలని సుబ్రహ్మణ్యానికి అనంతబాబు చెప్పాడు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తిరగబడేసరికి అనంతబాబు నెట్టారు. అనంతబాబు నెడితే సుబ్రహ్మణ్యం తలకు గాయమైంది. సుబ్రహ్మణ్యం లేచి మళ్లీ అనంతబాబు మీదకు వచ్చాడు. దీంతో.. అనంతబాబు మళ్లీ వెనక్కి నెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న గ్రిల్‌ తగిలి సుబ్రహ్మణ్యం తలకు మళ్లీ గాయమైంది. గాయపడిన సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి కారులో తీసుకెళ్లాడు. కారులో తరలిస్తుండగా సుబ్రహ్మణ్యానికి శ్వాస రావట్లేదని గమనించాడు. సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు అనంతబాబు భావించాడు. గతంలో సుబ్రహ్మణ్యం మద్యం సేవించి ప్రమాదాలు చేశాడు. ప్రమాదం జరిగినట్లు ఇంట్లో చెబితే అనుమానం రాదని భావించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఉంటున్న ప్రాంతానికి తీసుకెళ్లి అప్పగించే ప్రయత్నం చేశాడు." అని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు.

మేజిస్ట్రేట్‌ ముందు హాజరు: ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం.. స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు అనంత బాబును హాజరు పరిచారు.

ఇవీ చూడండి:

Last Updated : May 23, 2022, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.