నిందితులు చీకట్లో ఉండి కాల్పులు జరిపితే కేవలం ఆ అలికిడి విని… నేరుగా వాళ్ల పైకి కాల్పులు జరిపారా అని దిశ నిందితుల ఎన్‌కౌంటర్ (Justice sirpurkar commission)లో పాల్గొన్న కానిస్టేబుల్ రవిని… సిర్పుర్కర్ కమిషన్ ప్రశ్నించింది. నిందితులు పారిపోతూ తుపాకులు లాక్కున్నారనీ.. చీకట్లో నుంచి రాళ్లు కూడా విసిరారని.. అటు వైపు ఒకేసారి ఎక్కువగా కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారని.. కానిస్టేబుల్ రవి, కమిషన్ (Justice sirpurkar commission)కు వివరించారు.
సీఐ నర్సింహా రెడ్డిని మరోసారి కమిషన్ (Justice sirpurkar commission) ప్రశ్నించింది. తుపాకి పౌచ్‌లో నుంచి తుపాకీని ఎలా లాక్కెళ్లారనీ.. కమిషన్ (Justice sirpurkar commission) గత వారం సీఐ నర్సింహా రెడ్డిని ప్రశ్నించింది. ఎలా లాక్కెళ్లారో చూపించాలని కమిషన్ కోరింది. తుపాకి పౌచ్‌ను ఫోరెన్సిక్ లాబ్‌లో ఉంచారని.. నరసింహ రెడ్డి కమిషన్ (Justice sirpurkar commission)కు తెలిపారు. పౌచ్‌ను ఫోరెన్సిక్ లాబ్ నుంచి తెప్పించిన కమిషన్ (Justice sirpurkar commission).. నరసింహ రెడ్డిని పిలిపించి మరోసారి ప్రశ్నించారు. నిందితులు తన తుపాకీని పౌచ్‌లో నుంచి ఎలా లాక్కు పోయింది సీఐ నర్సింహా రెడ్డి కమిషన్ (Justice sirpurkar commission)కు చూపించారు. కాల్పుల్లో గాయపడ్డ ఎస్సై వెంకటేశ్వర్లును కమిషన్ (Justice sirpurkar commission) ప్రశ్నించింది. మంగళవారం కూడా వెంకటేశ్వర్లును కమిషన్ ప్రశ్నించనుంది.
ఇదీ చూడండి: Sirpurkar Commission: జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణకు విరామం.. ఎందుకంటే!
disha encounter case: 'బుల్లెట్ గాయాలు పరిశీలించకుండా మృతదేహాలను పలకరించేందుకు వెళ్లారా?'
HighCourt: దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
Justice sirpurkar commission : 'నిందితులు మాపై కాల్పులు జరపడం వల్లే మేం ఫైరింగ్ చేశాం'
SIRPURKAR COMMISSION:సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నల వర్షం..హైకోర్టును ఆశ్రయించిన ఏసీపీ
Sirpurkar Commission: 'వాంగ్మూలం విషయంలో ఎన్హెచ్ఆర్సీ బృందం భయపెట్టింది': సురేందర్
Sirpurkar Commission: శంషాబాద్ డీసీపీని విచారించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్