మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరమ్మ పేటకు చెందిన ఓ వృద్ధ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శేషమ్మ (63) అనే మహిళ గత కొన్ని రోజులుగా కల్లు, మద్యానికి బానిసై పిచ్చిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లింది. ఎంతకూ తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు.. ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు.
శేషమ్మను వెతుకుతూ వెళ్లిన కుమారుడు శివ కుమార్కు.. ఇంటికి దగ్గరలో ఉన్న పాత ఆసుపత్రి భవనం వద్ద ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే మిగిలిన కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని కిందకు దింపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై షంషుద్దీన్ తెలిపారు.
ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి