Inter Student Murder: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో ఓ యువతి హత్యకు గురైంది. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం గొంతును చున్నీతో బిగించి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హుగ్గెల్లి గ్రామ శివారులోని మామిడి తోటలో మృతదేహాన్ని గుర్తించారు.
తల్లిలేని సమయంలో..
హుగ్గెల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక.. జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇంట్లో తల్లిలేని సమయంలో బయటకు వెళ్లింది. అయితే తనంతట తానే బయటకు వెళ్లకపోవచ్చని ఎవరో పిలిస్తేనే బయటకు వెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అలా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక.. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి చుట్టుపక్కలా అంతా వెతికింది. తెలిసిన వారి ఇంట్లో వెదికినా ప్రయోజనం శూన్యమైంది. ఎక్కడికి వెళ్లిందోనని కంగారు పడింది.
చరవాణి ఆధారంగా దర్యాప్తు..
ఉదయం గ్రామ శివారులో మామిడి తోటలో పనిచేస్తున్న కూలీలకు ఎవరో పడుకున్నట్లుగా కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అమ్మాయి. ఎవరో చంపేసి ఇక్కడే వదిలేసి పారిపోయినట్లు భావించారు. వెంటనే ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్‌కు తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలిని బయటకు రప్పించి అత్యాచారానికి పాల్పడిన అనంతరం హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం దగ్గర దొరికిన చరవాణి ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టినట్లు వారు తెలిపారు.
ఇదీచూడండి: ఒకసారి కాదు.. రెండుసార్లు అతని చేతిలోనే.. బయటకు చెబితే పరువు పోతుందని..!