ETV Bharat / crime

సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి.. శవమై తేలాడు.!

ఈత సరదా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితులతో కలిసి వెళ్లిన ఇంటర్ విద్యార్థి మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ శివారులోని మల్లారం ఎఫ్​సీఐ గోదాం చెరువు వద్ద జరిగింది.

Inter student died in pond
ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి
author img

By

Published : Jun 6, 2021, 1:29 PM IST

సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ శివారులోని మల్లారం ఎఫ్​సీఐ గోదాం చెరువు వద్ద చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఇంటర్​ విద్యార్థి మరో ఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో ఇద్దరు బయటకు రాగా.. లోకేశ్​ అనే విద్యార్థికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు.

సమాచారం అందుకున్న రూరల్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో ఆచూకీ తెలియరాలేదు. ఈరోజు ఉదయం రెస్క్యూ టీం మృతదేహాన్ని వెలికితీసింది. పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్​హెచ్​వో లింబాద్రి తెలిపారు. మృతుడు నగరంలోని శివాజీనగర్​కు చెందినవారిగా పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: బావిలో పడి మతిస్తిమితం లేని యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.