అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చెన్నై కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3 కోట్ల విలువైన ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్త్‌జోన్ డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో చెన్నైకి చెందిన ఖాదర్, ఇబ్రహీం కీలక నిందితులుగా గుర్తించామని డీసీపీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
నిందితులు హైదరాబాద్‌లోని కొరియర్ సర్వీసుల ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులు 3.1 కిలోల ఎఫిడ్రిన్‌ను ఆస్ట్రేలియాకు పంపేందుకు సిద్ధపడ్డారని వివరించారు. ఫెడెక్స్, మదర్ ఇండియా కొరియర్, ఆవకాయ.కామ్ వంటి కొరియర్ సర్వీసుల ద్వారా సరఫరా చేస్తున్నారని తెలిపారు. కెమికల్ రిడక్షన్ చేసి ఎఫిడ్రిన్‌ను దేశం దాటిస్తున్నారన్నారు. 1 గ్రామ్ ఎఫిడ్రిన్‌ను రూ.8 వేలకు అమ్ముతున్నారన్న డీసీపీ.. కొరియర్ సర్వీసులతో కుమ్మక్కై డ్రగ్స్‌ను విదేశాలకు పంపుతున్నారని వెల్లడించారు. బ్యాంగిల్స్, ఫొటో ఫ్రేమ్‌లలో డ్రగ్స్ పెట్టి పంపుతున్నారని స్పష్టం చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురు కొరియర్ సిబ్బందినీ అరెస్ట్ చేశామని ఆమె తెలిపారు.
నిందితులు 1 గ్రామ్ ఎఫిడ్రిన్‌ను రూ.8 వేలకు అమ్ముతున్నారు. 3.1 కిలోల ఎఫిడ్రిన్‌ను ఆస్ట్రేలియాకు పంపేందుకు సిద్ధపడ్డారు. కొరియర్ సర్వీసులతో కుమ్మక్కై డ్రగ్స్‌ను విదేశాలకు పంపుతున్నారు. బ్యాంగిల్స్, ఫొటో ఫ్రేమ్‌లలో డ్రగ్స్ పెట్టి పంపుతున్నారు. - చందనాదీప్తి, నార్త్‌జోన్ డీసీపీ
ఇవీ చూడండి..
మంచంకోడుతో కొట్టి వ్యక్తి దారుణ హత్య.. ఎక్కడంటే..!!
బర్త్‌డే పార్టీకి వెళ్లిన బాలికపై గ్యాంగ్‌రేప్.. ఇంటర్వెల్లో స్కూల్ నుంచి ఇంటికొచ్చిన అమ్మాయిని..