Drugs Seized in Hyderabad : హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల విక్రయంపై.. ఇటు పోలీసులు.. అటు అబ్కారీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ధూల్‌పేటలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్‌ను.. హయత్‌నగర్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ.17.80లక్షల విలువైన 178 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ప్రవీణ్ వెల్లడించారు. నిందితుడు 2015లో చదువు కోసం దేశానికి వచ్చాడని తెలిపారు. వీసా పరిమితి ముగిసినా.. అక్రమంగా భారత్‌లోనే ఉంటున్నాడని చెప్పారు.
నిందితుడి వద్ద రెండు పాస్‌పోర్టులు కలిగి ఉన్నట్టు సీఐ ప్రవీణ్ తెలిపారు. అసలు పాస్‌పోర్టు నైజీరియాకు చెందినది కాగా.. నకిలీ పాస్‌పోర్టు ఘనా దేశానికి చెందిందని వివరించారు. నిందితుడు మాదకద్రవ్యాలను బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్టు చెప్పారు. అతని వద్ద నుంచి రూ.17.80లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుడిని విచారించగా.. సరైన సమాధానాలు చెప్పడం లేదని అన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే తమకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విదేశీయులు ఎవరైన అనుమానస్పదంగా ఉంటే ఫిర్యాదు చేయాలని సీఐ ప్రవీణ్ సూచించారు.
"నకిలీ ధ్రువపత్రాలు, నకిలీ పాస్‌పోర్ట్ ద్వారా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. గత మూడు నెలల్లోనే 400 సిమ్‌కార్డులు కొనుగోలు చేశాడు. నిందితుడు చదువు నిమిత్తం నైజీరియా వీసాలో బీ ఫార్మసీ చదువుతున్నట్టు చెప్పాడు. నకిలీ పాస్‌పోర్ట్‌లో బీటెక్ చెేస్తున్నాని తయారు చేశాడు. నిందితుడు ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నాడు." - ప్రవీణ్, సీఐ
ఇవీ చదవండి: దారి దోపిడీ కేసులో దొంగలు ఎవరు..? బాధితుడ్ని విచారిస్తున్న పోలీసులు