Hotel Staff Attack on Customer: హోటల్‌కు వచ్చిన వినియోదారుడిపట్ల సిబ్బంది అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ ఒకటిలోని ఏఎన్‌ఆర్ కాంప్లెక్స్‌లో ఉన్న పరంపర అనే హోటల్‌కు ఈ నెల 25న సాయంత్రం ఓ కస్టమర్ వచ్చాడు. సదరు వినియోగదారుడి పట్ల సిబ్బంది అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు పెద్దఎత్తున వాగ్వాదానికి దిగడంటో పాటు.. బాధితుడిని హోటల్ సిబ్బంది విచక్షణారహితంగా చితకబాదారు.
హోటల్ నుంచి బయటకు వచ్చిన బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హోటల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించారు. సీసీటీవీ దృశ్యాలను ఆధారంగా చేసుకుని.. హోటల్ యాజమాని రాకేష్ బాంగ్‌తోపాటు మేనేజర్ ఇతర సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: