ETV Bharat / crime

ఫోన్​ దొంగిలించాడంటూ యువకున్ని చితకబాదిన హిజ్రా - hijras in siricilla

తన ఫోన్​ దొంగిలించాడంటూ ఓ యువకునిపై హిజ్రా ప్రతాపం చూపించిన ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. ఇష్టమొచ్చినట్లు చితకబాది తీవ్రంగా గాయపర్చింది. విచక్షణారహితంగా కొట్టటం వల్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్న ప్రయాణికులు బాధితున్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

hijra hulchal in siricilla
hijra hulchal in siricilla
author img

By

Published : Jan 18, 2021, 4:32 PM IST

ఫోన్​ దొంగిలించాడంటూ యువకున్ని చితకబాదిన హిజ్రా

రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్​లో ఓ హిజ్రా హల్​చల్​ చేసింది. ఓ యువకునిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. గత కొద్ది నెలలుగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన హిజ్రాలు పట్టణంలో వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో డబ్బులు యాచిస్తూ జీవిస్తున్నారు. కాగా... ఆదివారం రాత్రి పాత బస్టాండ్​లో నిద్రిస్తున్న తన జేబులో నుంచి ఆ యువకుడు పోన్ దొంగిలిస్తుండగా దొరకబట్టానని ఓ హిజ్రా ఆరోపించింది.

తన జేబులో ఉండాల్సిన 8 వేల నగదు మాయమైందని... వాటిని ఆ యువకుడే దొంగిలించాడని ఆరోపిస్తూ బాధితున్ని ఇష్టారీతిన చితకబాదింది. బస్టాండ్ ఆవరణలోని మెట్లపై నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళుతూ... బూటుకాలుతో విచక్షణారహితంగా తన్నింది. కర్రతో కొడుతూ.. నానా బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అక్కడున్న కొంతమంది ప్రయాణికులు 108కు సమాచారమివ్వగా... యువకున్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.

ఇదీ చూడండి: సరిగా చదవటం లేదని కుమారుడికి నిప్పంటించిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.