Gun firing in srikakulam: శ్రీకాకుళంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. రామచంద్రపురం గ్రామ సర్పంచ్ వెంకటరమణమూర్తిపై అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. మధురానగర్లోని ఆయన కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ అర్ధరాత్రి వెళ్లింది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెంటతీసుకెళ్లింది. వీరి మధ్య సంభాషణలు జరుగుతుండగా... ఆమెతో వచ్చిన వ్యక్తులు.. తుపాకితో రెండుసార్లు కాల్పులు జరిపి... అక్కడి నుంచి పరారయ్యారు.

తూటలు వెంకటరమణ పొట్టను తాకుతూ.. వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ మహేంద్ర తెలిపారు.

ఇదీ చదవండి: Seized Goods Theft: సీజ్ చేసిన శ్రీగంధం చెక్కలు, ఆయిల్ మాయం.. ఎవరి పని..?