girl suicide attempt: పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ఆందోళనకు గురై ఓ విద్యార్థిని ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అందుకు సంబంధించిన వివరాలు కుల్సుంపుర ఎస్సై సత్యనారాయణ వెల్లడించారు. జియాగూడ ఇక్బాల్‌గంజ్‌కు చెందిన బాలిక(15) జియాగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది.
కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 15 రోజులు స్కూల్‌కు వెళ్లలేదు. వచ్చే నెల 23 వ తేదీ నుంచి పరీక్షలు ఉండటంతో ఒత్తిడికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొంది. గమనించిన ఆమె తల్లి, సోదరి మంటలార్పి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 67 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: interstate thief: కార్ల దొంగతనంలో.. సింగిల్ హ్యాండ్ గణేష్