Knife attack at Begumpet : హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. రసూల్‌పురాలోని ఇలాహీ మసీదు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ప్రదీప్ అనే వ్యక్తిపై మునీర్, అతని స్నేహితులు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
డబ్బులు ఇవ్వలేదని...
ప్రదీప్ అనే వ్యక్తి తెల్లవారుజామన నాలుగు గంటలకు ఇంటికి వెళ్తుండగా... మసీదు వద్ద ఉన్న మునీర్, అతని స్నేహితులు ఆపి డబ్బులు అడిగినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ఆగ్రహంతో వారంతా కలిసి దాడి చేశారని వెల్లడించారు. కత్తితో పొడిచారని వివరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... అంబులెన్స్ ద్వారా ప్రదీప్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. ప్రదీప్, మునీర్ ఇద్దరు పాత స్నేహితులేనని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: LOVER CHEATING: ప్రేమ పేరుతో నయవంచన.. పోలీసులను ఆశ్రయించిన యువతి