సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి సాయికిరణ్(4) అనే బాలుడిని ఓ మహిళ తీసుకువచ్చి చేర్చింది. భవనం మెట్ల పైనుంచి పడ్డాడని... చికిత్స అందించాలని వైద్యులను కోరింది. తన పేరు సరిత, భర్త విజయ్ కుమార్... మియాపూర్లో నివాసముంటున్నట్లు చెప్పింది. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు.
ఈ క్రమంలో మహిళ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆస్పత్రి వైద్యులు పటాన్‌చెరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చిన్నారి నిజంగా మెట్లపై నుంచి పడ్డాడా లేక ఏదైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు మృతదేహాన్ని చూస్తే వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: ఆ గూడెంలో 200 జనాభా.. 56 మందికి కరోనా