నలుగురు మైనర్లు అదృశ్యమైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో కలకలం రేపింది. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన నలుగురు మైనర్లు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. వారిలో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. బాలికల వయస్సు 14, 15 ఏళ్లుకాగా బాలుర వయస్సు 13, 17 ఏళ్లు. వీరిలో ముగ్గురు పిల్లలది ఒకటే కుటుంబం. ఇంటి వద్ద పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారని భావించి తల్లిదండ్రులు ఊరుకున్నారు. చీకటిపడుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆ ప్రాంతమంతా వెతికారు.
ఎక్కడా కనిపించకపోవడంతో గురువారం రాత్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి నలుగురు మైనర్లు కనిపించకుండాపోవడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్య, కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై మధుపవన్, పాతగుంటూరు సీఐ వాసుతోపాటు పలువురు ఎస్సైలు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. కొందరు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొని అక్కడ సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి వరకు పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: Loan Apps: 106 కోట్ల రూపాయలను జప్తు చేసిన ఈడీ