ETV Bharat / crime

'కుటుంబ సభ్యులే మోసం చేశారు'.. పిల్లలతో సహా దంపతులు గోదారిలో దూకారు! - పశ్చిమగోదావరిలో కుటుంబం ఆత్మహత్య వార్తలు

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యలమంచిలి మండలం చించినాడ వంతెన వద్ద ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు సతీశ్​, సంధ్య.. వారి పిల్లలు జశ్విన్​, బింధుగా పోలీసులు గుర్తించారు.

పిల్లలతో సహా దంపతులు గోదారిలో దూకారు!
పిల్లలతో సహా దంపతులు గోదారిలో దూకారు!
author img

By

Published : Aug 1, 2021, 6:59 PM IST

పిల్లలతో సహా దంపతులు గోదారిలో దూకారు!

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెన వద్ద ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పు గోదావరిజిల్లా మామిడికుదురుకు చెందిన సతీశ్​, సంధ్య.. తమ ఇద్దరు పిల్లలైన నాలుగేళ్ల జశ్విన్​, రెండేళ్ల బిందుతో కలిసి.. శనివారం పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.

ఆ తర్వాత బంధువుల ఇంటి నుంచి బయలుదేరిన వీరు.. తమ ఇంటికి చేరుకోలేదు. కంగుతిన్న కుటుంబసభ్యులు.. పాలకొల్లు పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేశారు. అయితే చించినాడ వంతెనపై ఓ ద్విచక్ర వాహనం అనుమానాస్పదంగా ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు.. నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని వారు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చించినాడ వంతెన వద్ద లేఖ..

తమ కుటుంబసభ్యులే తమను మోసం చేశారని.. ఈ కారణంగానే తన భర్త, పిల్లలతో చనిపోతున్నట్లు భార్య సంధ్య పేరిట ఉన్న ఓ ఆడియోను పోలీసులు గుర్తించారు. అలాగే.. ఓ లేఖను సైతం ఘటనా స్థలం వద్ద స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ
పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ

ఇదీ చదవండి: Maoist Dead : భద్రాద్రి పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.