ETV Bharat / crime

two persons died: ఇనుపచువ్వను తీయబోయి.. రెండేళ్ల చిన్నారితో సహా తండ్రి మృతి - ఇస్నాపూర్‌లో విషాదం

two persons died
దుస్తులు తీస్తుండగా విద్యుదాఘాతం
author img

By

Published : Dec 27, 2021, 2:49 PM IST

Updated : Dec 27, 2021, 6:27 PM IST

14:43 December 27

two persons died: ఇనుపచువ్వను తీయబోయి.. రెండేళ్ల చిన్నారితో సహా తండ్రి మృతి

two persons died: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఓ ఇంట్లోని ముగ్గురు కుటుంబసభ్యులు విద్యుదాఘాతానికి గురి కాగా.. రెండేళ్ల చిన్నారితో పాటు ఇద్దరు మృతి చెందారు. వీరంతా ఒడిశాలోని జాజిపూర్ మండలం జగాత్​ సింగ్​పూర్​కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

died with electric shock: చనిపోయిన వారిలో బసుదేవమాలిక్‌ అతని కూతురు రెండేళ్ల చిన్నారి కున్నూ మాలిక్‌ కూడా ఉంది. ఈ ప్రమాదంలో బసుదేవమాలిక్‌ భార్య రేను మాలిక్‌​ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇనుపచువ్వ తీసే క్రమంలో ప్రమాదం

​ఒడిశా రాష్ట్రానికి చెందిన బసుదేవమాలిక్‌ కొంతకాలం క్రితం బతుకుదెరువుకోసం ఇస్నాపూర్​లోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ తన కుటుంబంతో కలిసి ప్రముఖ్‌నగర్‌లోని ఓ భవనంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం కిటికీపై ఉన్న ఇనుపచువ్వను బసుదేవ మాలిక్‌ తీయబోయాడు. పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు అతని చేతిలో ఉన్న ఇనుపచువ్వ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో బసుదేవమాలిక్‌, అతని కాళ్లవద్ద ఉన్న రెండేళ్ల చిన్నకూతురు కున్నుమాలిక్‌ కూడా అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో భార్య రేను మాలిక్‌ తీవ్రంగా గాయపడటంతో ఆమెను చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 27, 2021, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.