పొరుగు రాష్ట్రం నుంచి గంజాయి(Ganja seized) తీసుకువచ్చి.. స్థానికంగా విక్రయిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ శివారు చెరువు కట్టపై గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పటాన్చెరు ఎక్సైజ్ అధికారులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఏపీలోని కృష్ణా జిల్లా పెందుర్రుకు చెందిన ఇషాన్.. గంజాయి(Ganja seized) విక్రయిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. అతని వద్ద 1.5 కిలోల గంజాయి లభ్యం కాగా.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఇషాన్(Ganja seized).. బాచుపల్లిలో ఒక గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. బాచుపల్లి గదిలో దాచిన మూడున్నర కిలోల గంజాయి(Ganja seized), చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పటాన్చెరు అబ్కారీ సీఐ సీతారాం రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: Railway Crime News: టికెట్ బుక్ చేసుకుని మరీ చోరీలు!