కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీ వద్ద ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి సిద్దిపేట వైపు కూలర్లు తీసుకెళ్తున్న ఆటోలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వాహనదారులు డ్రైవర్ను అప్రమత్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇవ్వగా... వెంటనే కూలర్లను కిందికి నెట్టి మంటలార్పారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇదీ చదవండి: ఇంటి బయట నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి