ETV Bharat / crime

కమలాపూర్​లో అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఇల్లు - వరంగల్​ అర్బన్​ జిల్లా తాజా వార్తలు

ఆ దంపతులకు కరోనా నిర్ధరణయింది. దీంతో వారు హోంఐసోలేషన్​లో​ ఉంటున్నారు. ఇంతలో వారు నివసిస్తున్న ఇల్లు మంటల్లో కాలిబూడిదయింది. ఈ ఘటన వరంగల్​ అర్భన్​ జిల్లాలో జరిగింది.

కమలాపూర్​లో అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఇల్లు

author img

By

Published : May 15, 2021, 10:31 PM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్​ గ్రామ పంచాయతీ పరిధిలోని కాశింపల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు ఓ ఇంటికి నిప్పంటుకొని పూర్తిగా తగలబడి పోయింది. కరోనా హోం ఐసోలేషన్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగటంతో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు.

షేక్‌ ఇమామ్‌ అతని భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. శనివారం వారు నివసిస్తున్న ఇంట్లో ప్రమాదవవాత్తు విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశారు. కానీ సాధ్యపడలేదు. ఇల్లు కాలి బూడిదయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: ఉద్యమంతో సంబంధంలేని వాళ్లు కూడా బెదిరిస్తున్నారు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.