జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ ప్రభుత్వాసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి బాలింతల వార్డులో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. డ్యూటీలో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆసుపత్రిలో ఉన్న 30 మందిని బయటకు తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇర్షాద్ అక్కడికి చేరుకుని ఆపరేషన్ అయినా ఆరుగురు ప్రసవ మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి ఈ రోజు మధ్యాహ్నంకల్లా విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఆస్తి నష్టం కూడా తక్కువగా జరిగినట్లు డాక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: Murder : తల్లీకూతుళ్ల దారుణ హత్య.. అల్లుడే హంతకుడు!