కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు కన్నతండ్రి. వావి వరసలు మరిచిపోయి కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కన్న కూతురిపై తండ్రి ఏడాదిన్నర కాలంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి పెట్టే హింసలు తాళలేక కుమార్తె.. తల్లికి విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: live video: గణేశ్ మండపం వద్ద డాన్స్ చేస్తూ.. అంతలోనే...