మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటకు దిగుబడి సరిగ్గా రాక రైతు భూక్యా వెంకన్న(41) అదే పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అసలేం జరిగిందంటే...
భూక్యా వెంకన్నకు మూడు ఎకరాల భూమి ఉంది. రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. సుమారు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. తామర పురుగుతో పాటు.. అకాల వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతింది. గతంలో మూడు లక్షల రూపాయల అప్పు ఉండగా.. సాగు కోసం చేసిన రెండు లక్షల రూపాయలతో కలిసి... అప్పులు 5 లక్షలకు చేరుకున్నాయి. అప్పులు తీరే మార్గం కనపడక పోవడంతో.. గత కొద్ది కాలంగా మనోవేదనకు గురవుతున్నాడు.
ఈ క్రమంలో వెంకన్న శనివారం పంట చేనులో పురుగు మందు తాగి.. ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన తండావాసులు... వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ... ఆదివారం తుదిశ్వాస విడిచారు. భార్య నాగమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: Boy suicide post: ఆత్మహత్యకు అనుమతించాలంటూ బాలుడు విజ్ఞప్తి..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!