నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన వారి ఇంటిముందు మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఎస్టీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్న కారణంతో సాగర్ నుంచి మాచర్ల వెళ్లే రహదారిలో నూతన వంతెనపై నుంచి దూకి రామచందర్(58) ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో ధర్నాకు దిగారు. రామచందర్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.
ఇటీవలే ఎదురింటి వారితో వివాదం కావడంతో రామచందర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. రాజేందర్‌కు, మృతునికి కేబుల్ టీవీ లావాదేవీల వ్యవహారంలో వివాదం ఉంది. దీంతో రాజేందర్ కావాలనే ఎదురింటి వారితో గొడవ జరిగేలా చేసి కేసు పెట్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.