ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం నడిపూడి గ్రామానికి చెందిన యాళ్ల రవిశంకర్ (27) మంగళవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. రవిశంకర్ రాసిన లేఖ బుధవారం ఉదయం ఆయన తల్లిదండ్రులకు దొరికింది. ఏపీ పంచాయతీ నాలుగో విడత ఎన్నికల్లో వైకాపా నాయకులు 25 ఓట్లు రిగ్గింగ్ చేశారని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
రిగ్గింగ్ జరిగిన విషయం పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్లకు తెలుసని వివరించారు. దీనిపై స్థానిక పోలీసులతో పాటు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టోల్‌ఫ్రీ నంబరు ద్వారా ఫిర్యాదు చేసినట్లు రవిశంకర్ తల్లిదండ్రులు శ్రీదేవి, సత్యనారాయణ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్‌కు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: బాపూ.. చూస్తున్నావా నీ దేశాన్ని!