ETV Bharat / crime

ఈటల​కు అన్యాయం జరిగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నం - telangana varthalu

ఈటలకు అన్యాయం జరగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ అభిమాని ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. స్థానికులు అడ్డుకోగా.. లారీ కిందకు చేరి నిరసన తెలిపాడు.

eetela rajendar fan
ఈటల​కు అన్యాయం జరిగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నం
author img

By

Published : May 2, 2021, 7:57 PM IST

ఈటల​కు అన్యాయం జరిగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నం

ఈటల రాజేందర్​కు అన్యాయం జరిగిందంటూ మంచిర్యాల జిల్లా మందమర్రిలో అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. మందమర్రి అంగడి బజార్ ప్రాంతానికి చెందిన వెంకటేష్ ముదిరాజ్​కు మొదటి నుంచి ఈటల రాజేందర్ అంటే ఎనలేని అభిమానం. ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు కూడా చేశాడు.

హైదరాబాద్​లో ఉండి క్యాటరింగ్ పనులు చేసే వెంకటేష్ రెండు రోజుల క్రితం మందమర్రికి వచ్చాడు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈటల రాజేందర్​కు మద్దతుగా ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం అటుగా వెళ్తున్న లారీ కిందకు చేరి తన నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు చేరుకుని వెంకటేష్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: కదులుతున్న బస్సు కిందపడి కొవిడ్​ బాధితుడు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.