ETV Bharat / crime

Bike Burnt in Nampally : తాగి బైక్​ నడిపాడు.. పోలీసులు పట్టుకోగానే తగులబెట్టేశాడు

Bike Burnt in Nampally : తాగి వాహనం నడపిన ఓ వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్​ తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకున్నారు. అతని వాహనాన్ని సీజ్ చేస్తామని చెప్పారు. బైక్​ను సీజ్ చేస్తామనగానే.. ఆ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతేగాక వాహనాన్ని తగులబెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్​ నాంపల్లిలో చోటుచేసుకుంది.

Bike Burnt in Nampally
Bike Burnt in Nampally
author img

By

Published : Jan 4, 2022, 9:11 AM IST

Bike Burnt in Nampally : డ్రంక్ అండ్ డ్రైవ్​లో దొరికిన ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనాన్ని తగులబెట్టాడు. సోమవారం రాత్రి హైదరాబాద్​ నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో పాతబస్తీకి చెందిన సజ్జత్ అలీ ఖాన్​ను ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించి పట్టుబడ్డాడు.

బైక్​కు నిప్పంటించి..

Bike Burnt in Hyderabad : తన వాహనాన్ని సీజ్ చేస్తాననడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. క్షణికావేశంలో తన ద్విచక్ర వాహనానికి (చేతక్) నిప్పంటించాడు. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు మంటలను అదుపు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సజ్జత్ అలీ ఖాన్​పై నాంపల్లి పోలీసులు న్యూసెన్స్ కేస్ నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.