హైదరాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోయారు. పీకలదాకా తాగి.. కారులో రయ్‌రయ్‌మంటూ షికారు చేశారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. మత్తులో తేలిపోతున్న మందుబాబు.. కారును కూడా గాల్లో పోనిచ్చాడు.
ఇంకేముంది.. మూసుకుపోతున్న కళ్లకు ముందేముందో కనపడక ఓ గేటును ఢీకొట్టేశాడు. తీరా.. మత్తు నుంచి తేరుకుని కారు దిగి చూస్తే.. ఆ గేటు ఎవరిదో కాదు.. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయానిది. కారు ఢీకొని సీపీ కార్యాలయం గేటు స్వల్పంగా ధ్వంసమైంది. మందుబాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇవీ చూడండి: