Drunk Man Hulchul: కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో తాగిన మైకంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. నిన్న అర్ధరాత్రి సమయంలో రామారెడ్డికి చెందిన మరో వ్యక్తిపై.. పూటుగా తాగిన యువకుడు దాడికి తెగబడ్డాడు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన జరగడంతో సముదాయించేందుకు అక్కడికి వచ్చిన కానిస్టేబుల్‌పైనా చేయిచేసుకున్నాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కలిసి యువకుడి చేతులు కాళ్ళు కట్టేసి అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కట్లు విప్పి చికిత్స చేస్తుండగా ఆ యువకుడు వైద్యసిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు.
ఇదీ చదవండి:మరో పరువు హత్య.. నడిరోడ్డుపై ఇనుప రాడ్లు, కత్తులతో దాడి.. ఇద్దరు అరెస్ట్